ఐటెమ్‌ కి ఒప్పుకొంది

laxmi-ray-item-song-balupuతెలుగులో అస‌లు సినిమాల్లేకపోవ‌డంతో ల‌క్ష్మీరాయ్ కెరీర్ చాలా డ‌ల్ గా సాగుతోంది. ఈమధ్య అర్జున్ – కోడి రామ‌కృష్ణల సినిమా ప‌ట్టాలెక్కింది. అందులో సెంటిమెంట్ రోల్ ప్లే చేస్తోంది. దాంతో గ్లామ‌ర్‌ కి అవ‌కాశమే రావ‌డం లేదు. ఇక గ‌త్యంత‌రం లేక ఐటెమ్ పాట‌కీ సై అనేసింద‌ట‌. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం బ‌ల‌పు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అస‌లే ఆక‌ర్షణ లేక క‌ళాహీనంగా త‌యారైన ఈ సినిమాకి జోష్ తెప్పించే ప‌నిలో భాగంగా అర్జెంటుగా ఓ ఐటెమ్‌సాంగ్‌ ని ఇరికించేశారు. ఆ పాట‌లో లక్ష్మీరాయ్ చిందేయ‌డానికి ఒప్పుకొంది. క‌నీసం ఇలాగైనా నాలుగు డ‌బ్బులు పోగేసుకొందామ‌ని డిసైడ్ అయ్యిందేమో? త‌మిళంలో సిద్దార్థ్ సినిమాలో న‌టించే ఛాన్స్ కూడా అందుకొంది. అయితే అందులో హీరోయిన్‌ గా కాదు. ఓ ప్రత్యేక పాత్రలో క‌నిపించ‌నుంద‌ట‌. కొంప‌దీసి… వ్యాంప్ గా కాదుక‌దా?!