Site icon TeluguMirchi.com

లారెన్స్‌కి గాయాలు

Raghava Lawrenceప్రముఖ కొరియోగ్రాఫర్‌, న‌టుడు, ద‌ర్శకుడు లారెన్స్ గాయ‌ప‌డ్డారు. ముని 3 షూటింగ్‌లో భాగంగా ఓ డాన్స్ సీక్వెన్స్ రిహార్సల్స్ చేస్తుండ‌గా ఆయ‌న కింద‌ప‌డ్డారు. దాంతో మెడ‌, మోకాలు ద‌గ్గర తీవ్రమైన గాయాల‌య్యాయి. ఆయ‌న్ని వెంట‌నే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేర్చారు. లారెన్స్ మూడు వారాల పాటు షూటింగుల‌కు దూరంగా ఉండాల‌ని వైద్యులు సూచించారు. ముని, కాంచ‌న‌ల‌తో హిట్లు కొట్టిన లారెన్స్ ప్రభాస్‌ని రెబ‌ల్‌గా చూపించాల‌ని భంగ‌ప‌డ్డారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడ‌మే కాకుండా, నిర్మాత‌తో విబేధాల‌నూ సృష్టించింది. దాంతో ముని 3పై దృష్టి పెట్టారు లారెన్స్‌. ఇప్పుడు ఈ అనుకోని సంఘట‌న‌తో షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. అస‌లే.. సినిమాని శిల్పంలా చెక్కుతుంటారు లారెన్స్. ఈ పరిణామంతో ముని 3 మ‌రింత ఆల‌స్యం కాబోతోంది.

Exit mobile version