ఫొటోటాక్‌ : ఏమి ఈ లావణ్యం

తెలుగు ప్రేక్షకులకు అందాల రాక్షసి చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత నానితో నటించిన భలే భలే మగాడివోయ్‌ చిత్రంతో సూపర్‌ హిట్‌ను దక్కించుకుంది. దాంతో లావణ్య త్రిపాఠి కెరీర్‌ మారిపోతుందని అంతా భావించారు. కాని ఆమె మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఆమెకు లక్‌ కలిసి రాకపోవడంతో చేసిన ప్రతి సినిమా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఒకవేళ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఆమెకు గుర్తింపు రాలేదు.

సినిమాలతో పెద్దగా గుర్తింపు రావట్లేదని భావించిన ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. తన హాట్‌ ఫొటోలను మరియు ఇంకా రకరకాల వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె తన ఫొటోలను పోస్ట్‌ చేసింది. అందులో చాలా పద్దతిగా సాంప్రదాయ దుస్తుల్లో ఉంది. అందంతో పాటు ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడి ఫొటోలు ఉండటంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.