తాజాగా మరో మెగా ఆఫర్‌ను కూడా పట్టేసింది. సక్సెస్ హీరోగా దూసుకుపోతున్న మెగా హీరో అవకాశాన్ని లావణ్య తాజాగా తన సొంతం చేసుకుంది.మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్ విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలను చేస్తున్నాడు. ఇప్పటికే ‘జవాన్’ చిత్ర పనులలో బిజీగా ఉన్న సాయిధరమ్ తేజ్ త్వరలో వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు.