మరో మెగా ఆఫర్‌ పట్టేసిన అందాలరాక్షసి

lavanya-hot-mister3‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి తన అందంతో కుర్ర కారును అలా పట్టేసిన లావణ్య త్రిపాఠి వరుస చిత్రాలతో యమ బిజీ అవుతోంది. ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు మంచి మంచి చిత్రాలనే తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ‘మిస్టర్‌’ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న దానికి వరుణ్‌ తేజ్‌ పెద్దగా ఉపయోగపడలేదు. అయినా కూడా లావణ్యకు వరుస ఆఫర్‌లు వస్తూనే ఉన్నాయి.

తాజాగా మరో మెగా ఆఫర్‌ను కూడా పట్టేసింది. సక్సెస్‌ హీరోగా దూసుకుపోతున్న మెగా హీరో అవకాశాన్ని లావణ్య తాజాగా తన సొంతం చేసుకుంది.మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి సుప్రీమ్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సాయిధరమ్‌ తేజ్‌ విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలను చేస్తున్నాడు. ఇప్పటికే ‘జవాన్‌’ చిత్ర పనులలో బిజీగా ఉన్న సాయిధరమ్‌ తేజ్‌ త్వరలో వినాయక్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు.

Sai-Dharam-Tej-Heroinsఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ రొమాన్స్‌ చేయడానికి సొట్ట బుగ్గల చిన్నదైన లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నాడు. సాయిధరమ్‌ తేజ్‌ చిత్రాలంటే మినిమమ్‌ గ్యారెంటీ ఉంటుంది అని ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న సాయిధరమ్‌ తేజ్‌ సరసన నటించే అవకాశం రావడంతో లావణ్య ఖుషీ అవుతోంది. ఈ చిత్రంతో పాటే సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో కూడా నటించడానికి సాయి ధరమ్‌ తేజ్‌ రెడీ అవుతున్నాడు. ఈ ‘తిక్క’ హీరో లావణ్యకు హిట్‌ ఇస్తే లావణ్య సక్సెస్‌ రేటు పెరిగినట్టే.