క‌మ‌లినికి లాస్ట్ ఛాన్స్

Kamalini Mukherjeeఆనంద్ సినిమాలో అచ్చమైన తెలుగ‌మ్మాయిలా క‌నిపించి మురిపించింది క‌మ‌లినీ ముఖ‌ర్జీ. ఆ త‌ర‌వాత చెప్పుకోద‌గిన స్థాయిలో సినిమాలు చేయ‌లేక‌పోయింది. ప‌ద్ధతైన పాత్రల‌కే ప‌రిమితం అయిపోవ‌డంతో క‌మ‌లినికి ఛాన్సులై క‌రువైపోయాయి. చాలాకాలం త‌ర‌వాత మ‌ళ్లీ ఆమెకు ఓ తెలుగు సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. రామ్‌చ‌ర‌ణ్ – కృష్ణవంశీ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రీ‌కాంత్ కీల‌క పాత్రధారి. శ్రీ‌కాంత్‌కి జోడీగా క‌మ‌లినీ ముఖ‌ర్జీని ఎంచుకొన్నారు. ఈ క‌థ‌లో శ్రీ‌కాంత్‌ది ఎంత కీల‌క‌మైన పాత్రో, క‌మ‌లినీకీ అంతే ప్రాధ‌న్యం ఉన్న పాత్రట‌. ఈ సినిమాతో క‌మ‌లినీ కెరీర్ మ‌రో టర్న్ తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని చిత్రబృందం చెబుతోంది. శ్రీ‌కాంత్ – క‌మ‌లినీ జంట‌గా న‌టించే 2వ చిత్రమిది. అంత‌కు ముందు వీరిద్దరూ విరోధిలో క‌ల‌సి న‌టించారు.