లేడీస్ అండ్ జెంటిల్‌మెన్‌

Madhura Sreedharద‌ర్శకులు నిర్మాత అవ‌తారం ఎత్తడం మామూలే. మ‌రో ద‌ర్శకుడిని కెప్టెన్ కుర్చీలో కూర్చోబెట్టి, కేవ‌లం ప్రొడ‌క్షన్‌కే ప‌రిమితం అవుతారు. దాస‌రి నారాయ‌ణ‌రావు నుంచి మారుతి వ‌ర‌కూ ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇప్పుడు మ‌ధుర శ్రీ‌ధ‌ర్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. స్నేహ‌గీతం, ఇట్స్ మై ల‌వ్‌స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాల‌తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శకుడీయ‌న‌. ఇప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ సినిమా రూపొందిస్తున్నారు. మంజునాథ్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తారు. మంజునాథ్ ఎవ‌రో కాదు, శ్రీ‌ధ‌ర్ శిష్యుడే. అక్టోబ‌రు 2వ వారంలో ఈ సినిమా సెట్ప్‌పైకి వెళ్లనుంది. హీరో, హీరోయిన్ వివ‌రాలు త్వర‌లో తెలుస్తాయి. ఈ చిత్రానికి ర‌ఘు కుంచె సంగీతం అందిస్తారు.