Site icon TeluguMirchi.com

‘దొరసాని’ దర్శకుడి అత్తగారి హత్య ఎమ్మెల్యే పనట!

సుదీర్ఘ కాలంగా దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న కేవీఆర్‌ మహేంద్రకు ఎట్టకేలకు ‘దొరసాని’ చిత్రంతో అవకాశం దక్కింది. మొదటి సినిమాతోనే విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ మరియు జీవిత రాజశేఖర్‌ల తనయ శివాత్మికను డైరెక్ట్‌ చేసే అవకాశం ఈయనకు దక్కింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఈయన మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరును అయితే తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన ఒక యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చాలా ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

ఇంటర్వ్యూలో తన ప్రేమ కథను చెప్పిన మహేంద్ర తన భార్య చిన్న తనంలోనే తల్లిని కోల్పోయిందని చెప్పాడు. తన భార్య చిన్న వయసులో ఉన్న సమయంలో రాజకీయాల కారణంగా తల్లిని పోగొట్టుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన అత్తగారి మరణంకు కారణం అంటూ చెప్పుకొచ్చాడు. తమది ప్రేమ వివాహం కనుక ఇప్పటికి తన భార్య సోదరుడు మరియు తండ్రితో మాటలు లేవని, వారు కూడా నాతో ఎక్కువగా మాట్లాడరని చెప్పుకొచ్చాడు. నా భార్య మాత్రం తన వారితో బాగానే ఉంటుందని, తాను భవిష్యత్తులో వారితో కలిసి పోతానేమో అన్నాడు.

Exit mobile version