డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. పాన్ ఇండియాగా రాబోతోన్న ఈ మూవీని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతోన్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక షూటింగ్‌ను చకచకా చేస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఇప్పుడు ఓ అప్డేట్ ఇచ్చింది.
ఖుషి సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు మేకర్లు అప్డేట్ ఇచ్చారు. అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షూటింగ్‌కు సమాంతరంగా జరుపుతూ వచ్చారు. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి. ఇక హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన ‘నా రోజా నువ్వే..’, ‘ఆరాధ్య..’ పాటలు సోషల్ మీడియాలో శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.
It is a wrap for #Kushi
Post-production in full swing
In cinemas on 1st September 2023 in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam
@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/7l1qHMuwh7
— Mythri Movie Makers (@MythriOfficial) July 15, 2023