Site icon TeluguMirchi.com

మహేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్…

తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..సూపర్ స్టార్ మహేష్ బాబు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 09 న మహేష్ తన 44 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే. అభిమానులు , సినీ , రాజకీయ ,క్రీడా ప్రముఖులు మహేష్ కు విషెష్ తెలుపగా..కేటీఆర్ శనివారం త‌న ట్విట్ట‌ర్ ద్వారా బిలేటెడ్ బ‌ర్త్ డే విషెస్ అందించారు. త‌న‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

గ‌తంలో విజన్ ఫర్ బెటర్ టుమారో అనే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ ఒకే వేదికపై పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version