కేటీఆర్ కు ‘ భరత్ ‘ బాగా నచ్చాడట..

మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను.. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

తాజాగా ఈ సినిమాను తెలంగాణ మంత్రి కేటీఆర్ చూసి తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. చిత్రబృందం ఏర్పాటు చేసిన స్పెషల్ షో ద్వారా కేటీఆర్ వీక్షించారు. ఈ షోకు మహేష్ బాబు, కొరటాల శివ, నిర్మాత డీవీవీ దానయ్యలు హాజరయ్యారు. సినిమా చూశాక కేటీఆర్ మాట్లాడుతూ మంచి సినిమా తీశారని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.