ఇటీవల కేటీఆర్ తనయుడు కూడా ‘కాటమరాయుడు’ సినిమాను చూశాడట. ఆ సందర్బంగా సినిమా ఎలా ఉందని ఒక మీడియా సంస్థ బైట్ కోసం ప్రయత్నించగా, సాదా సీదాగానే ఉంది, గొప్పగా ఏమీ లేదు అంటూ చెప్పుకుంటూ వెళ్లి పోయాడు. అయితే దాన్ని రికార్డ్ చేయవద్దని మాత్రం చెప్పాడట. తండ్రికి నచ్చిన సినిమా తనయుడికి నచ్చలేదు. కాటమరాయుడు సినిమా కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ఎందుకు నచ్చలేదో చెప్పాలని అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి పవన్ సినిమాకు అన్ని విధాలుగా భారీ ప్రచారం జరుగుతుంది.