పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. మంచి కలెక్షన్స్ ఈ సినిమా వస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చూడటం జరిగింది. ఆ సదర్బంగా సినిమా బాగుందని పవన్ కళ్యాణ్‌ను కేటీఆర్ అభినందించాడు. అయితే అదే సినిమాను కేటీఆర్ తనయుడు చూసి సాదా సీదాగా ఉంది అంటూ తేల్చి చెప్పేశాడు.
ఇటీవల కేటీఆర్ తనయుడు కూడా ‘కాటమరాయుడు’ సినిమాను చూశాడట. ఆ సందర్బంగా సినిమా ఎలా ఉందని ఒక మీడియా సంస్థ బైట్ కోసం ప్రయత్నించగా, సాదా సీదాగానే ఉంది, గొప్పగా ఏమీ లేదు అంటూ చెప్పుకుంటూ వెళ్లి పోయాడు. అయితే దాన్ని రికార్డ్ చేయవద్దని మాత్రం చెప్పాడట. తండ్రికి నచ్చిన సినిమా తనయుడికి నచ్చలేదు. కాటమరాయుడు సినిమా కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ఎందుకు నచ్చలేదో చెప్పాలని అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి పవన్ సినిమాకు అన్ని విధాలుగా భారీ ప్రచారం జరుగుతుంది.