Site icon TeluguMirchi.com

తొలిప్రేమ రివ్యూ బై కేటీఆర్

వరుణ్‌తేజ్ తొలిప్రేమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్‌కల్యాణ్ కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయిన తొలిప్రేమ టైటిల్‌ను తిరిగి ఎంచుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు అధికమయ్యాయి. తొలిప్రేమ జ్ఞాపకాల్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేము. కడదాకా అవి మనల్ని వెంటాడుతుంటాయి. జ్ఞాపకాల్ని మననం చేసుకునే అందమైన ప్రయాణం తొలిప్రేమ అంటూ టీజర్ తో ఆసక్తి రేపాడు వరుణ్‌తేజ్ . టీజర్ లో చూపించినట్లే ఇదో ఫీల్ గుడ్ మూవీఅని రివ్యూలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పదించం విశేషంగా వుంది. సెన్సిటివ్ లవ్ స్టోరీ. చాలా కాలం తరువాత వచ్చింది, డైరక్షన్ బాగుంది. మ్యూజిక్ టెర్రిఫిక్, బ్యాక్ గ్రవుడ్ స్కోర్ బాగుంది. గీతాల రచన బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. వరుణ్, రాశీఖన్నా మంచి నటన కనబర్చారు అంటూ కేటిఆర్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా వుంది.

Exit mobile version