మల్లేశం అందరూ చూడాల్సిన ఫిలిం – కేటీఆర్

పెళ్లిచూపులు చిత్రంతో కమెడియన్ గా యావత్ యూత్ ను ఆకట్టుకున్న ప్రియదర్శి..ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ స్టార్ అయ్యాడు. ఓ పక్క కమెడియన్ గా రాణిస్తూనే తాజాగా మల్లేశం సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చేనేత కార్మికుల కష్టాలను తగ్గించడం కోసం ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. జూన్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్ర పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మల్లేశం సినిమా అందరూ చూడాల్సిన చిత్రం. చాలా హృద్యంగా, మానవీయ కోణంలో హృదయాలను హత్తుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి బాగా నటించారు. ఈ సినిమాలో ఓ పాట ఉంది.. అందులో ‘గాయపడిని కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో’ అనే మాట ఒక్క కవిత సినిమా ఎంత భావోద్వేగం ఉంటుందో చెబుతోంది.

ఈ సినిమాకి సంబంధించి రెండు మూడు అంశాలు నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఒకటి చేనేత కాళాకారులు. వీరు తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్నారు. ఇది మరుగున పడిపోతున్న కళగా.. అంతరించుకుపోతున్న కళగా మిగిలిపోతున్న ఈ పరిస్థితుల్లో.. వారి నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ.. వారి కష్ట, నష్టాలను హృద్యంగా ప్రస్తావించారు.