సౌత్ సినీ పరిశ్రమలో ఏ భారీ చిత్రం విడుదలయినా కూడా ఆ చిత్రాన్ని ఎలాగైనా విమర్శించాలని గట్టిగా డిసైడ్ అయ్యి అన్ని చిత్రాలను అలాగే నెగెటివ్‌గా మాట్లాడే బాలీవుడ్ రివ్యూ రచయిత కమల్ ఆర్ ఖాన్ తన వివాదాస్పద ట్వీట్లతో అందరికి విసుగు పుట్టిస్తు ఉంటాడు. ఈయన ‘బాహుబలి 2’ విడుదల కాకముందే అదో సుత్తి సినిమా, అందులో ఫైట్లు తప్పా ఏం లేవు, ఆ గ్రాఫిక్స్ కూడా చాలా చెత్తగా ఉన్నాయి అంటూ హీరోగా నటించిన ప్రభాస్ మరియు రానాలపై కుడా ఘాటు కామెంట్‌లు చేశాడు. ఆ తర్వాత సినిమా విడుదలయ్యాక ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా కూడా మంచి టాక్ వచ్చింది. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను సొంతం చేసుకుంది.
ఇదంతా చూసిన కమల్ ఆర్ ఖాన్ తాజాగా తన రివ్యూ పట్ల క్షమాపణ కోరాడు. ‘బాహుబలి 2’ చిత్రం నాకు నచ్చలేదు కానీ ప్రేక్షకులందరికి నచ్చింది, ప్రేక్షకులు అంటే దేవుళ్లతో సమానం కాబట్టి వారిని నేను గౌరవిస్తున్నాను, ప్రేక్షకుల పక్షానే నేను ఉంటాను, ‘బాహుబలి 2’ రివ్యూ అలా తప్పుగా రాసినందుకు నన్ను క్షమించండి రాజమౌళి గారు అండ్ యూనిట్ అంటూ కెఆర్‌కె క్షమాపణ కోరాడు. ఈయన క్షమాపణ కోరడంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రివ్యూ అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఇవ్వొచ్చు, తప్పుగా ఇస్తే సారీ చెప్పాలని ఏం లేదు కానీ కెఆర్‌కె సారీ చెబుతున్నాడు అనే అంశంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.