Site icon TeluguMirchi.com

కొత్త చిత్రాలపై క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి!

ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన నటి కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే అమ్మడు టాప్ రేంజ్ కి వెళ్లింది. మాములుగా మొదటి సినిమా హిట్ అయితే కానీ నెక్స్ట్ సినిమా ఛాన్స్ రాదు..అలాంటిది మొదటి చిత్రం రిలీజ్ అవ్వక ముందే అమ్మడికి వరుస ఆఫర్లు తలుపుతట్టాయి. నాని శ్యామ్ సింఘా రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురుంచి మీకు చెప్పాలి మూవీలోను కృతి ఛాన్స్ కొట్టేసింది. రామ్- లింగుస్వామి ప్రాజెక్టులోను అడుగుపెట్టేసింది.

తాజాగా కృతి శెట్టి తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురుంచి మాట్లాడుతూ, ప్రస్తుతం తన చేతిలో ఉన్నవి మూడు తెలుగు సినిమాలు మాత్రమేనని చెప్పింది. తమిళంలో తాను ప్రస్తుతం ఏ సినిమాలు చేయడం లేదనీ, ఒకవేళ ఒప్పుకుంటే ఆ విషయాన్ని తాను తెలియజేస్తానని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా ఈ మూడు ప్రాజెక్టులపైనే ఉందనీ, అవి పూర్తయిన తరువాతనే వేరే ప్రాజెక్టులను గురించిన ఆలోచన చేస్తానని అని అంది.

Exit mobile version