నా భార్య నుండి డబ్బులు తీసుకోలేదు – కృష్ణవంశీ

ramya-krishna-krishnavamsiకృష్ణ వంశీ ఈ పేరు వినగానే సింధూరం , నిన్నే పెళ్లాడతా, ఖడ్గం , మురారి వంటి సందేశాత్మక , ప్రేమ, కుటుంబకథ చిత్రాలు గుర్తుకొస్తాయి. సినిమా అంటే కృష్ణవంశీ సినిమానేరా అనుకునేలా సినిమాలు తీశారు. కానీ ఈ మధ్య ఆయన నుండే వచ్చి చిత్రాలు ఏది కూడా సక్సెస్ కావడం లేదు. దీంతో ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యం లో ఆయన ఫై రకరకాల రూమర్స్ ప్రచారం జరుగుతున్నాయి. వీటికి సమాధానం తెలిపాడు వంశీ.

నేను నా భార్య దగ్గరి నుండి డబ్బులు తీసుకుంటానని , వాటితోనే కాలం గడుపుతున్నాని ఇలా రకరకాల వార్తలు నా ఫైన వస్తున్నాయి. వాస్తవానికి నేను ఒక్క రూపాయి కూడా రమ్యకృష్ణ దగ్గరి నుండి తీసుకోలేదని , అలా తీసుకోవాల్సి వస్తే నేను చనిపోతే కానీ తీసుకోను అంటూ ఘాటుగా స్పందించాడు కృష్ణ వంశీ.

ప్రస్తుతం సందీప్ కిషన్ తో నక్షత్రం సినిమా చేస్తున్నాని , ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని తెలిపాడు.