కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సాయం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వారికోసం తమవంతు గా సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక సాయం అందిస్తున్న వేళ మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నటులు రెబల్‌స్టార్ కృష్ణంరాజు కరోనా నివారణ చర్యలకు తమ వంతు సాయంగా పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 10 లక్షల విరాళాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ.. ‘కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించడానికి డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా, ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలు అందజేస్తున్నారు. మా కుటుంబం నుంచి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండో అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు వచ్చారు.