బిగ్‌బాస్ 3 ఫేవరేట్ కంటెస్టెంట్ ఎవరు అంటూ కౌశల్‌ను ప్రశ్నించిన సమయంలో.. ప్రస్తుతానికి ఇంకా అంతా కూడా నటిస్తున్నట్లుగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే వారి నటన పూర్తి అవుతోందో అప్పుడు వారిలోంచి ఒక ఫేవరేట్ కంటెస్టెంట్ అంటూ బయటకు వస్తాడు అన్నాడు. నాకు ఫేవరేట్ ఎవరు అనే విషయం చెబితే ఇతర సభ్యుల ఆటపై ప్రభావం పడుతుంది. అందుకే నేను నా ఫేవరేట్ ఎవరు అనే విషయాన్ని చెప్పను. ఇక మొదటి సీజన్‌కు ఎన్టీఆర్, రెండవ సీజన్‌కు నాని గార్లు బాగా హోస్టింగ్ చేశారు. ఇప్పుడు అదే విధంగా నాగార్జున గారు కూడా సీజన్ 3కి మంచి హోస్టింగ్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేశాడు.