బిగ్‌బాస్‌ 3 ఫేవరేట్‌ కంటెస్టెంట్‌పై కౌశల్‌ కామెంట్స్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ ఒక ప్రభంజనం అని చెప్పాలి. సీజన్‌ ప్రారంభం అయిన నాలుగు వారాల్లోనే ఆయనే విజేత అంటూ ఒక క్లారిటీ వచ్చేసింది. కౌశల్‌ ఆర్మీ ఏం చెబితే అదే అన్నట్లుగా బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్స్‌ జరిగాయి. చివరకు బిగ్‌బాస్‌ విజేత విషయంలో కూడా కౌశల్‌ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. కౌశల్‌ ఆర్మీ కారణంగా కౌశల్‌ భారీ ఓట్లను దక్కించుకుని విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈవెంట్స్‌ మరియు ఇతరత్ర కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్న కౌశల్‌ ఒక ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

బిగ్‌బాస్‌ 3 ఫేవరేట్‌ కంటెస్టెంట్‌ ఎవరు అంటూ కౌశల్‌ను ప్రశ్నించిన సమయంలో.. ప్రస్తుతానికి ఇంకా అంతా కూడా నటిస్తున్నట్లుగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే వారి నటన పూర్తి అవుతోందో అప్పుడు వారిలోంచి ఒక ఫేవరేట్‌ కంటెస్టెంట్‌ అంటూ బయటకు వస్తాడు అన్నాడు. నాకు ఫేవరేట్‌ ఎవరు అనే విషయం చెబితే ఇతర సభ్యుల ఆటపై ప్రభావం పడుతుంది. అందుకే నేను నా ఫేవరేట్‌ ఎవరు అనే విషయాన్ని చెప్పను. ఇక మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండవ సీజన్‌కు నాని గార్లు బాగా హోస్టింగ్‌ చేశారు. ఇప్పుడు అదే విధంగా నాగార్జున గారు కూడా సీజన్‌ 3కి మంచి హోస్టింగ్‌ చేస్తున్నారంటూ కామెంట్స్‌ చేశాడు.