భోళా శంకర్ నుండి ‘తీను మారు’.. మోత మోగుతోందిగా !


మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న మూవీ ‘భోళా శంకర్’. ఇందులో మెగాస్టార్ సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తుండగా, సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో బ్యూటిఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

‘కొట్టార కొట్టు తీను మారు..’ అంటూ సాగే ఈపాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాటలో చిరు మరియు కీర్తి ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో డ్యాన్స్ అదరగొట్టారు. ఇక ఈ పాటను ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ హై పిచ్ వోకల్స్‌తో అద్భుతంగా పాడారు. కాగా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.