కొరటాల బాగా పెంచేసాడు..

Koratalashivaకొరటాల శివ డైలాగ్ రైటర్ గా భద్ర చిత్రం తో కెరియర్ స్టార్ట్ చేసి ఒక్కడున్నాడు , మున్న, బృందావనం, ఊసరవెల్లి వంటి చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన కొరటాల మిర్చి తో తనలోని దర్శకత్వ ప్రతిభను బయటకు చూపించాడు…మిర్చి తో ఒక్కసారిగా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ చేరిపోయాడు. తాజాగా మహేష్ బాబు తో ‘శ్రీమంతుడు ‘ అనే సోషల్ మెసేజ్ చిత్రం తో అందర్ని ఆకట్టుకున్నాడు.

శ్రీమంతుడు సక్సెస్ తో కొరటాల తన రెమ్యునిరేషన్ బాగా పెంచడాని టాక్. అతనిలో రైటింగ్ స్కిల్స్ పుష్కలంగా ఉండడం తో త్రివిక్రమ్ తరహాలోనే ఇతను కూడా రైటర్ గా , డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అయ్యాడని అందరు చెపుతున్నారు. ముందు ముందు ఇండస్ట్రీ లో మంచి భవిష్యత్ ఉందని సినీ ప్రముఖులు చెపుతున్నారు.