మ‌రో మిర్చిలాంటి సినిమా కోసం…

ram-charan-koratala-siva-moర‌చ‌యిత‌గా పేరు తెచ్చుకొన్న కొర‌టాల శివ‌… ద‌ర్శకుడిగా మారి తానేమిటో నిరూపించుకొన్నాడు. మిర్చితో బాక్సాఫీసు ద‌గ్గర ఓ మ‌ర‌పురాని విజ‌యం న‌మోదు చేసుకొన్నాడు. ప్రభాస్‌ ని చూపించిన విధానం ప్రేక్షకుల‌కు రెబ‌ల్‌ స్టార్ అభిమానుల‌కూ విప‌రీతంగా న‌చ్చింది. ఇప్పుడాయ‌న మ‌రో అవ‌కాశాన్ని అందుకొన్నారు. రామ్‌ చ‌ర‌ణ్‌ తో జ‌ట్టు క‌ట్టబోతున్నారు. చ‌ర‌ణ్‌-కొర‌టాల శివ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. స్ర్కిప్టు కూడా సిద్ధమైంది. మే నెల‌లో ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. జంజీర్, ఎవ‌డు సినిమాల‌తో బిజీగా ఉన్న చ‌ర‌ణ్‌.. మూడో సినిమానీ సెట్స్‌ పైకి తీసుకెళ్లడం చ‌ర‌ణ్ దూకుడిని నిద‌ర్శనం. త్వర‌లోనే క‌థానాయిక‌, మిగిలిన సాంకేతిక నిపుణుల వివ‌రాలు తెలియ‌జేస్తారు.