Site icon TeluguMirchi.com

బాలకృష్ణ వార్త ఫై క్లారిటీ ఇచ్చిన కొరటాల..

koratala-shiva-janathaమహేష్ బాబు కు శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ మరోసారి దానికి మించిన కథ తో మరో సినిమా చేయబోతున్న సంగతి తెల్సిందే..ప్రస్తుతం మహేష్ , మురుగుదాస్ దర్శకత్వం లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే జనవరి లో కొరటాల – మహేష్ మూవీ సెట్స్ ఫైకి రాబోతుంది.. ఇక ఈ లోపు ఈ చిత్రం ఫై ఓ వార్త మూడు , నాల్గు రోజులుగా సంచలనం సృష్టిస్తుంది.

ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నాడని , ఇది మల్టీస్టారర్ చిత్రం అని సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది..కాగా ఈ వార్త కొరటాల శివ వరకు వెళ్లడం తో దీని ఫై క్లారిటీ ఇచ్చాడు..మహేష్ తో చేయబోయే చిత్రం మల్టీస్టారర్ చిత్రం కాదని తన గత చిత్రాలు ఎలా ఉన్నాయో వాటి మాదిరిగానే సింగిల్ స్టార్ సినిమాని , ఈ చిత్రం ఫై వస్తున్న వార్తల్లో నిజం లేదని తన ట్విట్టర్ ద్వారా తేల్చాడు..దీంతో మల్టీస్టారర్ వార్త ఫై తెర పడినట్లు అయ్యింది.

Exit mobile version