Site icon TeluguMirchi.com

చిరంజీవి తర్వాత విజయ్‌ దేవరకొండతో..!

‘మిర్చి’ నుండి గత ఏడాది వచ్చిన ‘భరత్‌ అనే నేను’ వరకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. చేసిన సినిమాలు తక్కువే అయినా టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు. స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌గా కొరటాల శివ మారాడు. అలాంటి కొరటాల శివ గత సంవత్సర కాలంగా చిరంజీవితో సినిమాను చేసేందుకు ఎదురు చూస్తున్నాడు. చిరంజీవి 151వ చిత్రం సైరా ఆలస్యం అవ్వడం వల్ల ఈయన ఎదురు చూడాల్సి వచ్చింది. త్వరలోనే చిరంజీవి 152వ చిత్రంకు క్లాప్‌ పడబోతుంది. కొరటాల శివ చిరంజీవి సినిమా ఇంకా మొదలు పెట్టకుండానే తర్వాత సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.

విజయ్‌ దేవరకొండతో కొరటాల మూవీ ఉంటుందనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా వీరిద్దరి కాంబో సినిమా గురించి వార్తలు వచ్చాయి. తాజాగా డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విజయ్‌ దేవరకొండ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాలతో మూవీ ఉందంటూ ప్రకటించాడు. అది ఎప్పుడు ఎలా ఉంటుందనే విషయంను మాత్రం తాను ఇప్పుడు చెప్పలేను అంటూ సస్పెన్స్‌లో పెట్టాడు. దాంతో చిరంజీవితో సినిమాను పూర్తి చేసిన తర్వాత కొరటాల శివ వెంటనే విజయ్‌ దేవరకొండతో మూవీ తీస్తాడనే టాక్‌ ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విజయ్‌, కొరటాలల కాంబో మూవీ పట్టాలెక్కి 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version