సాధారణంగా ఇండస్ట్రీ లో ఓ కాంబినేషన్ హిట్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు..ప్రస్తుతం అదే జరుగుతుంది కాకపోతే ఇది మ్యూజిక్ డైరెక్టర్ విషయం లో..టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అంటే అందరికి ఇష్టమే..సుకుమార్ , త్రివిక్రమ్ లు అయితే తమ సినిమా లకు దేవి నే ఎంచుకుంటారు..
తాజాగా ఇప్పుడు వీరి లిస్ట్ లో మరో దర్శకుడు వచ్చి చేరాడు..అతడే కొరటాల శివ..మిర్చి , శ్రీమంతుడు , ప్రస్తుతం జనతా గ్యారేజ్ ఇలా ఇప్పటికే మూడు సినిమాలు దేవి తో చేసిన ఈయన, మరోసారి దేవి నే ఎంచుకున్నాడు..డి.వి.వి.దానయ్య తో చేయబోయే చిత్రానికి దేవి శ్రీ ని తీసుకున్నాడు..సెప్టెంబరు నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవుతాయి.