Site icon TeluguMirchi.com

కొరటాల కు ముడుపు అందింది.

మిర్చి మూవీ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కొరటాల, ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ వంటి వరుస హిట్స్ అందించి టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరాడు. ప్రస్తుతం మహేష్ బాబు ను మరోసారి డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా తరువాత మళ్లీ ఎన్టీఆర్ తోనే సినిమా చేయబోతున్న సంగతి తెల్సిందే.

ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ లు కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా చేయడం కోసం కొరటాల శివకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారట నిర్మాతలు. పంపిణీ రంగంలో ఉన్నవారే నిర్మాతలు అని తెలుస్తుంది. అంతే కాదు వీరు కొరటాల శివకు అత్యంత సన్నిహితులని వినికిడి. మహేష్ బాబుతో సినిమా పూర్తి చేసి కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెడతాడట.

Exit mobile version