Koragajja : ‘కాంతార’ కంటే భిన్నంగా తులునాడు దేవతా గాథ ‘కొరగజ్జ’


Koragajja : త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొరగజ్జ’ తులునాడు ప్రాంత దేవత కొరగజ్జ చుట్టూ నడిచే కథతో రూపొందింది. కర్ణాటక, కేరళ తీర ప్రాంతాల్లో విశ్వసించే ఈ దేవతపై దర్శకుడు చేసిన లోతైన పరిశోధన ఆధారంగా ఈ కథ అభివృద్ధి అయింది. సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఈ చిత్రాన్ని ఓ ప్రత్యేక అనుభవంగా అభివర్ణిస్తూ, సంప్రదాయ సంగీతాన్ని ఆధునిక శైలిలో మేళవిస్తూ ఎన్నో కొత్త ప్రయోగాలు చేశానన్నారు. ఆరు పాటలతో కూడిన ఈ చిత్రంలోని ప్రతి పాటకు సాహిత్యం దర్శకుడు స్వయంగా రాశారు. శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, అర్మాన్ మాలిక్ లాంటి ప్రముఖ గాయకులు ఈ చిత్రానికి స్వరమిచ్చారు.

Also Read :  KA Movie : ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న కిరణ్ అబ్బవరం 'క'

ఈ చిత్రం ‘కాంతార’ కంటే విభిన్నంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. కాంతార ఒకే దేవతపైన ఆధారపడి ఉండగా, ఈ చిత్రం అనేక దేవతల సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో కబీర్ బేడి, సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, భవ్య, శ్రుతి వంటి నటీనటులు నటించగా, సినిమాటోగ్రఫీకి మనోజ్ పిళ్ళై, ఎడిటింగ్‌కు జిత్ జోషి, డిఐకి లిజు ప్రభాకరన్ వంటి టాప్ టెక్నికల్ టీమ్ పని చేసింది. మల్టీ లాంగ్వేజ్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఆడియో రైట్స్ కోసం ఇప్పటికే పలు పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి.

Also Read :  Vijay Devarakonda : రెట్రో మూవీ ఈవెంట్ లోని తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ