Site icon TeluguMirchi.com

పవన్ చిత్రం రవితేజ చేస్తున్నాడా..?

Kona-Raviచాలా రోజులనుండి టాలీవుడ్ స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న ‘కోన వెంకట్ ‘ దర్శకత్వం లోకి అడుగు పెట్టాలని చూస్తున్నాడు. అందుకోసం తన మొదటి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చెయ్యాలని అందుకోసం పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ ను కూడా రెడీ చేసుకున్నాడు.. ఆ మద్య కోన వెంకట్ పవన్ కళ్యాణ్ కు కథ వినిపించాడని, పవన్ కూడా కథ ఓకే అన్నాడు అని వార్త బాగా ప్రచారం జరిగింది. కానీ ఆ తరవాత పవన్ మళ్లీ బిజీ ఆయె పోవడం వల్ల కోన తో సినిమా అలాగే ఆగిపోయింది.

తాజాగా అదే కథను మాస్ మహారాజ్ రవితేజ తో సినిమా చేయడానికి కోన సిద్దం అయ్యాడట. ఆ స్టొరీ కూడా రవి తేజ కు వినిపించాడట, దానికి రవి కూడా ఒకే చెప్పాడని, ఆ కథకు ‘రంగు పడుద్ది’ అనే టైటిల్ కూడా నిర్ణయించారట. ఇక ఈ ప్రాజెక్ట్ సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారని సమాచారం.

Exit mobile version