Site icon TeluguMirchi.com

ధనుష్‌ తల్లిదండ్రుల కేసు క్లైమాక్స్‌కు చేరింది

Dhanush-okamanasuతమిళ స్టార్‌ హీరో, సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అల్లుడు అయిన ధనుష్‌పై గత కొంత కాలంగా ఏదో ఒక వివాదం మొదలవుతూనే ఉంది. కొన్ని నెలల క్రితం కదిరేశన్‌, మీనాక్షి అనే దంపతులు ధనుష్‌ మా కొడుకు అంటూ మదురై కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసు విషయమై ఇప్పటికే పలు సార్లు విచారణలు నడిచాయి. ఇప్పటి వరకు ఏ విషయమై తేలింది లేదు. అయితే తాజాగా కదిరేషన్‌ దంపతులు తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ 10వ తరగతి మార్క్‌ షీట్‌ మరియు టీసీని కోర్టులో పొందు పర్చడం జరిగింది.

ఈ మార్క్‌ షీట్‌ మరియు టీసీలో పొందు పర్చినట్లుగా ధనుష్‌కు పుట్టుమచ్చలు ఉంటాయని కదిరేషన్‌ దంపతులు చెబుతున్నారు. దాంతో మదురై కోర్టు ఈనెల 28న మధురై ప్రభుత్వ హాస్పిటల్‌లో పుట్టుమచ్చల పరీక్షకు సిద్దం అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు కూడా హాజరు అవ్వాలని ధనుష్‌కు నోటీసులు వెళ్లాయి. మరి ఈ నోటీస్‌పై ధనుష్‌ ఎలా స్పందిస్తాడు అనేది ప్రస్తుతం అందరు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. 28న ధనుష్‌తో పాటు ఆయన ప్రస్తుత తల్లిదండ్రులు కూడా హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version