Site icon TeluguMirchi.com

మే 9న కొచ్చెడ‌యాన్‌

rajani

 

ర‌జ‌నీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొచ్చ‌డ‌యాన్ ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మే 9న ఈ చిత్రాన్ని తొమ్మిది భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌జ‌నీ సినిమా అంటే.. ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అందుకే భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల‌ను ఈ సినిమా కోసం బ్లాక్ చేశారు. దాదాపు గా 4వేల స్ర్కీన్స్‌ల‌పై కొచ్చ‌డ‌యాన్ ప్ర‌ద‌ర్శిస్తారు. దీపికా ప‌దుకొణె, శ‌ర‌త్‌కుమార్‌, జాకీ ఫ్రాఫ్‌, నాజ‌ర్ కీల‌క పాత్రలు పోషించిన చిత్రానికి ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. క‌థ‌, స్ర్కీన్ ప్లే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌. ర‌వికుమార్ అందించారు. రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌కుడు. అయితే తెలుగు లో విక్ర‌మ‌సింహాగా వ‌స్తున్న ఈ చిత్రం రైట్స్ కొన‌డానికి మ‌న నిర్మాత‌లెవ‌రూ ఆస‌క్తి చూపించ‌కోవ‌డం విశేషం. కార‌ణం.. భారీ రేట్ల‌తో హ‌డ‌లెత్తించ‌డ‌మే. మ‌రి అంత రేటు అయితే ఎలా..? ఆడ‌బ్బుల‌తో తెలుగులోనే నేరుగా ఓ తెలుగు సినిమా తీసుకోచ‌చ్చు అన్న‌ది ఇక్క‌డి నిర్మాతల మాట‌. మ‌రి ఈ విక్ర‌మ సింహాని రిలీజ్ చేసే అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో…?

Exit mobile version