Site icon TeluguMirchi.com

ఈ రెండు సినిమాలూ డౌటేనా?

rajani
మే 9న బాక్సాఫీసు ద‌గ్గర రెండు సినిమాలు సంద‌డి చేయ‌బోతున్నాయ‌నుకొన్నాం. అయితే ఆ సినిమాల విడుద‌ల‌లు ఇప్పడు డౌటులో ప‌డ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ర‌జ‌నీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న కొచ్చడ‌యాన్‌, చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ అరంగేట్ర చిత్రం రేయ్‌.. మే 9న విడుద‌ల‌కు ఫిక్స‌య్యాయి. అయితే ఎన్నిక‌ల హంగామా త‌ర‌వాతే రేయ్ సినిమాని విడుద‌ల చేయాల‌ని వైవిఎస్ చౌద‌రి నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ట‌. రేయ్ విడుద‌ల వాయిదా ప‌డ‌డం మ‌న‌కు రొటీన్ కాదు కాబ‌ట్టి సర్దుకుపోవ‌చ్చు. అయితే ఇప్పుడు ర‌జ‌నీ సినిమా కొచ్చ‌డ‌యాన్‌కీ ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతోంది. ర‌జ‌నీ సినిమాకి ఆర్థిక స‌మ‌స్య‌లున్నాయ‌ట‌. నిర్మాత‌ల‌కూ, పంపిణీదారుల‌కూ మ‌ధ్య ఓ వివాదం రేగిందట‌. అందుకే కొచ్చ‌డ‌యాన్ ప‌బ్లిసిటీ కూడా మొద‌లుపెట్ట‌లేద‌ని తెలుస్తోంది. ఆ వివాదం స‌ద్దుమ‌ణిగాకే విక్ర‌మ‌సింహా విడుద‌ల చేస్తార‌ని చెన్నై టాక్‌. ఈ రెండు సినిమాల‌కూ భ‌య‌ప‌డి వెన‌క్కి వెళ్లిన చిన్న సినిమాలు ఇప్పుడు వ‌రుస క‌డ‌తాయేమో..?

Exit mobile version