Site icon TeluguMirchi.com

ర‌జ‌నీ ప్రభంజ‌నం

Kochaidaayర‌జ‌నీకాంత్ స్టామినా ఎలాంటిదో… మ‌రోసారి తెలిసింది. మ‌న టాలీవుడ్ హీరోల టీజ‌ర్ల హిట్స్ చూసుకొని మురిసిపోతున్నాం. రోజుకి ల‌క్ష హిట్స్ వ‌స్తే… వావ్ అంటున్నాం. కానీ ర‌జ‌నీకాంత్ ముందు మ‌న హీరోల రికార్డులు బ‌లాదూర్ అని తేలిపోయింది. ర‌జ‌నీకాంత్ యానిమేష‌న్ చిత్రం కొచ్చడ‌య‌న్ సాధిస్తున్న రికార్డుల ముందు మ‌న సినిమా టీజ‌ర్లు బోసి బోతున్నాయి. నిజం… కొచ్చడ‌యాన్ టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లై ప్రభంజ‌నాలు సృష్టిస్తోంది. ఈ టీజ‌ర్ విడుద‌లైన 24 గంటట్లో దాదాపు ప‌ది ల‌క్షల హిట్స్ వ‌చ్చాయి. సౌత్ ఇండియాలో ఇదే రికార్డ్‌. అది జ‌స్ట్ యానిమేష‌న్ చిత్రం మాత్రమే. ర‌జ‌నీ న‌డిచొస్తున్న దృశ్యం ఒక్కటే ఉంటుంది. దానికే అంత ఫాలోయింగ్ వ‌చ్చింది. ఇక ర‌జ‌నీ డైలాగ్ చెబితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. టాప్ లేచిపోదూ…

Exit mobile version