ట్రైలర్‌లో సంపూ విశ్వరూపం చూపించాడని చెప్పాలి. తన నటన, డాన్స్, డైలాగ్ డెలవరీ ఇలా అన్ని విషయాలను కొబ్బరిమట్టలో తన విశ్వరూపంతో సినిమాను ఒక హై ఓల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ మాదిరిగా తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. కామెడీతో కడుపుబ్బ నవ్వడంతో పాటు ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉందనిపిస్తుంది. హృదయకాలేయం చిత్రంతో పోల్చితే సంపూలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే ఈ చిత్రం దాదాపుగా 10 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొబ్బరిమట్ట చిత్రం సంపూను మరో స్థాయికి తీసుకు వెళ్లనుందా లేదా చూడాలి.