గత వారంలో ప్రధానంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాగార్జున మన్మధుడు 2 మరియు అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ చిత్రాలు ముందు రోజు రాగా ఆ తర్వాత రోజు సంపూర్నేష్‌బాబు ‘కొబ్బరిమట్ట’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూడు సినిమాల్లో ఓపెనింగ్స్ విషయం తీసుకుంటే మన్మధుడు 2 కు మంచి వసూళ్లు వచ్చాయి. అయితే సినిమా టాక్ పరంగా చూసుకుంటే, వీక్ డేస్‌లో షేర్ పరంగా చూసుకుంటే మాత్రం మూడింట్లో కూడా కొబ్బరిమట్ట చిత్రం ముందు ఉందంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
‘కొబ్బరిమట్ట’ చిత్రం ఒక పిచ్చి సినిమా అంటూనే జనాలు తెగ చూసేస్తున్నారు. విడుదలైన మొదటి నాలుగు రోజుల్లో అయిదు కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం రెండు మూడు కోట్లతోనే ఈ చిత్రం పూర్తి అయ్యి ఉంటుంది. సినిమా ఇప్పటికే లాభాల బాటలో పడింది. రేపు రెండు మూడు సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు సక్సెస్ అయితే కొబ్బరిమట్ట జోరు తగ్గే అవకాశం ఉంది. వాటి ఫలితాలు తారు మారు అయితే మాత్రం కొబ్బరిమట్ట జోరు కంటిన్యూ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.