Site icon TeluguMirchi.com

వీడు మాములు ఆండ్రాయుడ్ కాదు..

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. ఆగస్టు 10 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ లో సంపూ పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం తాలుకా ట్రైలర్ విడుదలై ఆసక్తి పెంచగా..తాజాగా ఆండ్రాయుడ్ రోల్ కు సంబందించిన సాంగ్ టీజర్ విడుదల అయ్యింది.

ఈ సాంగ్ టీజర్ లో సంపూ మాములు డాన్స్ చేయలేదు..ఒకానొక సమయంలో బాలకృష్ణ ఎలాగైతే నాట విన్యాసాలు చేసాడో..ఇప్పుడు సంపూ కూడా ఆలా చేసి అప్పటి బాలయ్య డాన్స్ ను గుర్తు చేసాడు. చిన్న టీజర్ లోనే ఈ రేంజ్ లో ఉంటె సాంగ్ మొత్తం ఎలా ఉండబోతుందో..అది వెండి తెరపై ఇంకెలా ఉంటుందో..అని అంత మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా ఆ టీజర్ ఫై లుక్ వెయ్యండి.

Exit mobile version