ఇప్పటికే రైట్స్ కోసం కొబ్బరిమట్ట చిత్ర యూనిట్ తో చర్చలు జరుగుతున్నాయట. ఈ సినిమా విడుదలకు ముందే రీమేక్ రైట్స్ కోసం పోటీ పడటం విశేషం. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడుగా మూడు పాత్రల్లో సంపూ కనిపించనున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ & సంజన మూవీస్ బ్యానర్లలో ఆది కుంభగిరి, సాయి రాజేష్& నీలం నిర్మిస్తున్నారు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు స్టీవెన్ శంకర్ అందిస్తున్నాడు.