తమిళం లో రీమేక్ అవుతున్న సంపూర్ణేష్ బాబు చిత్రం ..

kobbari-matta-tamila-rightsహృదయ కాలేయం చిత్రం తో బర్నింగ్‌ స్టార్‌ గా సినీ ప్రపంచానికి పరిచయం అయిన సంపూర్ణేష్‌ బాబు..ఆ తర్వాత ఒకటి , రెండు చిత్రాలో సైడ్ హీరోగా కనిపించి అబిమానులను ఆకట్టుకున్నాడు..తనదైన పంచ్ డైలాగ్ లతో యూత్ ను ఆకట్టుకునే ఈ కమెడియన్, తాజాగా కొబ్బరి మట్ట చిత్రం తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ అందర్నీ ఆకట్టుకోవడం తో ఓ తమిళ కమెడియన్ ఈ చిత్ర రీమేక్ మీద ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం.

ఇప్పటికే రైట్స్ కోసం కొబ్బరిమట్ట చిత్ర యూనిట్ తో చర్చలు జరుగుతున్నాయట. ఈ సినిమా విడుదలకు ముందే రీమేక్ రైట్స్ కోసం పోటీ పడటం విశేషం. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడుగా మూడు పాత్రల్లో సంపూ కనిపించనున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ & సంజన మూవీస్ బ్యానర్లలో ఆది కుంభగిరి, సాయి రాజేష్& నీలం నిర్మిస్తున్నారు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు స్టీవెన్ శంకర్ అందిస్తున్నాడు.