చరిత్ర సృష్టించనున్న సంపూర్ణేష్ క్లైమాక్స్…

kobbari-matta-tamila-rightsసంపూర్ణేష్ బాబు..ఈ పేరు తెలియని నెటిజను ఉండడు..హృదయ కాలేయం టీజర్ తో ఏకంగా రాజమౌళి దగ్గరినుండి ప్రశంసలు అందుకున్న బర్నింగ్ స్టార్ , మరోసారి కొబ్బరి మట్ట తో అందరి మట్టలను చించడానికి వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ తో అంచనాలు రెట్టింపు చేసిన సంపూ, తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్ తో చరిత్ర సృష్టించబోతున్నాడని టాక్..

ఈ వార్త చూసిన సినీ జనాలు హృదయ కాలేయం లో నువ్వు చూపించిన క్లైమాక్స్ చాలు కొత్తగా ఏం చూపిస్తావ్ అనే కామెంట్స్ వేస్తున్నారు..ఇంతకీ ఆ క్లైమాక్స్ లో ఏం చుపించాడో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ & సంజన మూవీస్ బ్యానర్లలో ఆది కుంభగిరి, సాయి రాజేష్& నీలం నిర్మిస్తున్నారు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు స్టీవెన్ శంకర్ అందిస్తున్నాడు.