సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కొబ్బరిమట్ట’..రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

హృద‌య కాలేయం చిత్రం తో హీరో ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్‌ బాబు.. ఆ తర్వాత బిగ్ బాస్ షో తో మరింత పాపులర్ అయ్యారు. ఈ షో తర్వాత పలు చిత్రాల్లో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కొబ్బరి మట్ట అనే సినిమా చేసాడు. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మూడు ఏళ్లు అవుతుంది కానీ ఇంత వరకు థియేటర్స్ లోకి రాలేదు. ఎట్టకేలకు దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.

రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకొని ‘U/A ‘ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు మారగా..తాజాగా ఆగస్టు 02 న వస్తుందని అంత అనుకున్నారు. కానీ ఇప్పుడు దానిని ఆగస్టు 10 కి తీసుకెళ్లారు. మరి ఆ రోజైన థియేటర్స్ లోకి వస్తుందో రాదో చూడాలి. రోనాల్డ్‌సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అన్న మూడు పాత్రలతో సంపూర్ణేష్ సందడి చేయనున్నారు.