కొరటాల శివ నిర్మాతగా మారబోతున్నాడా…?

మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ తాజాగా భరత్ అనే నేను తో వరుస హిట్స్ కొట్టి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా స్థానం సంపాదించుకున్న కొరటాల..ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకొని నిర్మాతగా మారేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్లో హాట్ హాట్ ప్రచారం అవుతుంది. రైటర్ గా ఇండస్ట్రీ కి పరిచమైన కొరటాల , ఆ తర్వాత డైరెక్టర్ గా వరుస సక్సెస్ లు చవిచూశాడు. ఇప్పుడు నిర్మాతగా మరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడట.

త‌న ద‌గ్గ‌ర చాలా క‌థ‌లు ఉన్నాయ‌ని వాటిన్నింటిని తాను డైర‌క్ష‌న్ చేయ‌లేన‌ని భావించిన కొర‌టాల కొత్త ద‌ర్శ‌కుల‌ను పరిచయం చేస్తు ఆ సినిమాల‌కు తానే నిర్మాత‌గా ఉండ‌ల‌ని అనుకుంటున్నాడట. మ‌రి కొర‌టాల ప్లాన్ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. కొర‌టాల శివ త‌న నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుంద‌ని అంటున్నారు.