లిప్ లాక్ ఫై చరణ్ హీరోయిన్ ఏమన్నదో తెలుసా..?

భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ..ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటిస్తుంది. షాయిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా..కియారా హీరోయిన్ గా చేస్తుంది. ఇక ఈ సినిమాలో హాట్ రొమాన్స్ , లిప్ లాక్ లు దండిగా ఉన్నాయట. వీటి ఫై కియారా స్పందించింది.

సినిమాలో ముద్దు సీన్స్ ను చాలా నార్మల్ గా చేశామంటూ కియారా అద్వానీ చెప్పుకొచ్చింది. ఇతర సీన్స్ మాదిరిగానే ఆ సీన్స్ ను కూడా చిత్రీకరించాం. కథలో.. సీన్ లో భాగంగా ఉంటాయి కనుక వాటికి ఎక్కువ కష్టపడకుండా చేశామంటూ ..షూటింగ్ సమయంలో లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు తప్ప అంతకు ముందు ఆ తర్వాత వాటి గురించిన ఆలోచనే లేదని ఆ సీన్స్ చాలా సింపుల్ గా షూట్ అవ్వడం వల్లే వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం రాలేదంటూ తెలిపింది. అమ్మడి మాటలు విన్న అభిమానులు , నెటిజన్లు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా..ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత గా ఉన్నారు. జూన్ 21 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్..హిందీలోను డైరెక్ట్ చేసాడు.