Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ.. క్యూరియాసిటీ పెంచుతున్న టైటిల్..


కొంత విరామం తర్వాత యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమాకు ‘క’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం మేకోవర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తుండగా, సందీప్ మరియు సుజీత్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ లవ్ సాంగ్.. కెమిస్ట్రీ అదుర్స్

విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ‘క’ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇకపోతే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. సామ్ సీ ఎస్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు మేకర్స్.