Nagarjuna : సూపర్ స్టార్ సినిమాలో కింగ్ నాగార్జున.. లుక్ అదుర్స్


సూపర్‌స్టార్ రజనీకాంత్, జైలర్‌తో మళ్లీ సక్సెస్‌ఫుల్‌గా రీఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో #తలైవర్171 పేరుతో “కూలీ” చిత్రాన్ని చేస్తున్నారు. వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, టైటిల్ రివీల్ టీజర్‌కు విశేష స్పందన లభించింది.

ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మరింత స్టార్ పవర్‌ను చేకూర్చేందుకు, కింగ్ నాగార్జునను ప్రత్యేక పాత్రలో కాస్ట్ చేశారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన సైమన్ పాత్రలో పరిచయం అవుతుండగా, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన డైనమిక్ అవతార్‌లో కనిపిస్తున్నారు. స్టైలిష్ షేడ్స్, మెరిసే బంగారు గడియారం ధరించి, ఆయనలో సొఫిస్టికేటెడ్ ఆరా ఉట్టిపడుతుంది.

కళానిధి మారన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2025 లో విడుదల కానుంది.