గత కొన్ని రోజులుగా రానా అనారోగ్యం గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. రానాకు కిడ్నీ సమస్య ఉందని, అందుకే అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తలను కొట్టి పారేస్తూ తాను అమెరికాలో ఉన్నాను, డియర్ కామ్రేడ్ చిత్రాన్ని ఇక్కడే చూడబోతున్నట్లుగా పేర్కొన్నాడు. రానా బాగానే ఉన్నాడని భావిస్తున్న తరుణంలోనే మరో వార్త దావాణంలా వ్యాప్తి చెందుతుంది. రానాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిందని, రానాకు ఆయన తల్లి లక్ష్మి దగ్గుబటి కిడ్నీని దానం చేసిందని అంతా ప్రచారం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం రానాకు కిడ్నీ ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం ఆయన తల్లి మరియు రానా ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్ని కారణాల వల్ల రానా రెండు కిడ్నీలను తీసేయాల్సి వచ్చిందట. దాంతో ఆయన తల్లి కిడ్నీల్లో ఒకదాని తీసి రానాకు పెట్టారంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. జాతీయ మీడియాలో సైతం ఈ వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఈ వార్తలపై రానా నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. రానా గతంలో తన ఆరోగ్యం గురించి పలు సార్లు స్పందించాడు. అయినా ఈవార్తలు వస్తూనే ఉన్నాయి. కనుక నిజం అయ్యి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.