తెలంగాణ లో ఖైదీ రిలీజ్ కాదా..?

Telangana-khaidi-release

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 ఫై ఎలాంటి అంచనాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం..ఈ సినిమాకు సంబదించిన ఏ విషయం బయటకు వచ్చిన పెద్ద సంచలనమే సృష్టిస్తుంది..తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ లో ఎవరుచూడద్దు అంటూ ఓ వార్త వాట్సప్ లో వైరల్ అయ్యింది..ఇంతకీ ఆ వార్త ఏంటి అంటే..

“.. వేయి మంది ఉద్యమకారుల మరణానికి కారణమైన తెలంగాణ ద్రోహీ చిరంజీవి సినిమా ఖైదీ నం .150 సినిమాను తెలంగాణ రాష్ట్రంలో విడుదల కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఉద్యమకారులుగా కోరుతున్నాము . తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండ అడ్డుపడి తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా వేయి మంది ఉద్యమకారుల మరణానికి కారణమైన వాడిలో ఇతను ముఖ్యుడు కాబట్టి ఒక సగటు తెలంగాణ వాడిగా తెలంగాణ రక్తం , చీము ,రక్తం ఉన్న ప్రతి ఒక్కడు ఈ సినిమాని థియేటరు లో చూడవద్దు అని మనవి చేస్తున్నాము. చిరంజీవి సినిమాని థియేటరు లో చూసినవాడు తెలంగాణ ద్రోహీ ..’’

Khaidi-No150-holiday

ఈ వార్తను ఎవరో కావాలనే ప్రచారం చేస్తున్నారు..ఇది గిట్టని అభిమానుల పనినా..లేక వేరే వ్యక్తులు చేస్తున్నారా అనేది తెలియదు కానీ వాట్సప్ లో మాత్రం బాగా ప్రచారం అవుతుంది..