Site icon TeluguMirchi.com

‘ ఖైదీ – శాతకర్ణి ‘ ల ప్లస్ , మైనస్ లు ఇవే..

khaidi-gowthami-plus-mins

మెగా , నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ పోరు రానేవచ్చింది. మరో వారం రోజుల్లో ఖైదీ నెం 150 , గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి..ఈ రెండు చిత్రాల అభిమానులు ఎవరికీ వారే తమ సినిమా హిట్ అయ్యింది..తమ సినిమా హిట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు..

కానీ ఈ రెండు చిత్రాల్లో ఎవరికీ ప్లస్ , ఎవరికీ మైనస్ అనేది బయటకు వచ్చింది..తాజా సమాచారం ప్రకారం ఖైదీ కి ఎక్కువ మైనస్ ఉందని , అదే శాతకర్ణికి ప్లస్ అయ్యిందని చెపుతున్నారు. బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమా రన్ టైంతో పోలిస్తే, చిరంజీవి సినిమా రన్ టైం మరొక 15 నిముషాలు ఎక్కువగా ఉండడం ఇక్కడ మైనస్ గా తెలుస్తుంది. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా దాదాపుగా 147 నిముషాల ఉండగా , ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మాత్రం కేవలం 135 నిముషాలు ఉండడం ప్లస్ గా చెప్పవచ్చు .

ఇటీవల రన్ టైం ఎక్కువ ఉన్న చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి..ఎక్కువ రన్ టైం ఉండడం తో అంత సేపు థియేటర్స్ లలో ప్రేక్షకులు ఉండలేకపోతున్నారు..చిత్రం ఏ మాత్రం కాస్త బోర్ కొట్టిన సినిమా రన్ టైం ఫై ఆ ఎఫెక్ట్ పడుతుంది .. ఇప్పుడు మెగా అభిమానుల్లో కూడా ఖైదీ రన్ టైం కాస్త ఖంగారు పెడుతుంది..బ్రహ్మి కామెడీ ఉందని , సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చని చిత్ర యూనిట్ చెపుతున్న ఇటీవల బ్రహ్మి కామెడీ ఎలా ఉంటుంది చూస్తున్న అభిమానులు కాస్త సినిమా ఫై టెన్షన్ గా ఉన్నారు..మరి ఖైదీ రన్ టైం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Exit mobile version