మెగా రికార్డ్స్ ను అడ్రెస్ లేకుండా చేసిన బాహుబలి..


‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలై వారం రోజులు కావొస్తున్నా ఇంకా టికెట్స్ దొరకని పరిస్థితి..ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాలు ..దేశాల్లో కూడా ఇదే పరిస్థితి..తాజాగా ఉత్తరాంధ్ర లో సరికొత్త రికార్డ్స్ సృష్టించడమే కాదు మెగా స్టార్ రికార్డ్స్ ను సైతం బద్దలు కొట్టింది..మాములుగా ఉత్తరాంధ్ర లో కలెక్షన్స్ చాల తక్కువగా ఉంటాయని అందరూ అనుకుంటుంటారు..కానీ బాహుబలి పార్ట్ 1 విడుదల తర్వాత మిగతా ఏరియాల మాదిరి ఇక్కడ కూడా వసూళ్లు కుమ్మేసాయి.

‘బాహుబలి: ది బిగినింగ్’ రూ.9 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. ఐతే ఈ ఏడాది ఆరంభంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా రూ.10 కోట్ల మైలురాయిని దాటేసి ఆశ్చర్యపరిచింది. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ వసూళ్లు చూసి మారే ఏ చిత్రం ఇంత కలెక్షన్స్ వసూళ్లు చేయలేదని అనుకున్నారు.. కానీ ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ కేవలం ఆరు రోజుల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టేసింది.

‘బాహుబలి-2’ షేర్ ఆరు రోజులకే రూ.14 కోట్లకు చేరుకుంది.ఈ జోరు చూస్తుంటే ఫుల్ రన్లో ఇక్కడ బాహుబలి-2 రూ.25 కోట్ల షేర్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పటికీ సినిమా జోరు తగ్గలేదు. హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది.