ఖైదీ యూఎస్ ప్రీమియర్స్‌ షోస్ కలెక్షన్స్..

khaidi-new-stii

మెగాస్టార్ చిరంజీవి ని ఎప్పుడెప్పుడు చూద్దామని అభిమానులను 9 ఏళ్లుగా ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియింది కాదు..ఆ నిరీక్షణ కు ఈరోజుతో తెరపడింది..బాస్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానుల ముందుకు వచ్చాడు మెగాస్టార్..బాస్ కు గ్రాండ్ వెల్ కామ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు యూఎస్ అభిమానులు సైతం రెడీ అయ్యారు. ఇక అర్ధరాత్రి నుండే యూఎస్ లో ప్రీమియర్స్‌ షోస్ సందడి చేసాయి..

Khaidi-No-150-set3

ప్రీమియర్ షో హైలైట్స్ : ఖైదీ నెం 150

ఎన్నడూ లేని విధంగా యూఎస్ లో భారీ ఎత్తున ప్రీమియర్స్‌ షోస్ వేసి అభిమానులకు సంబరాలు నింపారు.ఇక అడ్వాన్స్ రూపం లోనే ఖైదీ వన్ మిలియన్ మార్క్ సాధించడం జరిగిందంటే మెగా ఖైదీ అంచనాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు..ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్ ఉంటుందని ఎవరు అనుకోలేదు..ఇక డిస్ట్బ్యూటర్స్ , థియేటర్స్ యాజమాన్యం అయితే పండగ చేసుకుంటున్నారు.. ప్రీమియర్స్‌ షో స్ ఇలా ఉంటె అసలు షోస్ ఇంకెలా ఉండబోతాయో..కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఇప్పటి నుండే లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు..మరోవైపు సినిమా టాక్ కూడా మెగా హిట్ అని రావడం తో అందరూ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.